Sunday, 2 October 2011

సామాన్యుడి వేదన.. ఆవేదన .. నివేదన ..


Dr. M.A.Virinchi
               B.A.M.S.,B.A., DHMM, MBA (NU)
Founder Chairman-Hithaoishi-The Well-wisher- Trust, entrusted for 7 dimensional wellness
Chief Monitoring Officer-ISERVE (Institute of Scientific Research on Vedas)
Honorary Consultant: Saroni Health Care Center
Honorary Adviser : Ayurhitha Health Care Center
Honorary Adviser : Dr. Virinchi's Kalpa Ayush Enterprises
Honorary Adviser:  PŘefer-Nodal referral centre for better health care  
Consultant : Formulation Research & Development , Organisation development  and
          Learning & Development

సామాన్యుడి వేదన..  ఆవేదన .. నివేదన ..

ఓ పాలకులారా ! ఒక్కసారి విశ్లేషించండి.. వివేచించండి..
ఈ వరాన్ని  నా పాలిట శాపంగా మార్చకండి..
 ఎందుకంటే
౩౭ రూపాయలు సంపాదించగలిగితే లేదు నాకు పేదరికం..
ఎంత మోదం.. మరెంత ప్రమోదం..
ఆ మేరకు ఖర్చు తగ్గితే ఎంత బాగుండు.. ఇక నాదే పెద్దరికం..
ఎలాగోలా ఎవరి గోలా లేకుండా ..నే సంపాదించుకుంటా..
నా ఖర్చు తగ్గించండి..
నేను అమాయకుణ్ణి .. నా ఖర్చు తగ్గించాకే
నా పేదరికాన్ని ధనవంతుడిగా మార్చారనుకుంటున్నా..
ఇక నన్నేమార్చకండి..
నాకు నమ్మకం ..
ఎందుకంటే .. ఈ వరం ఇచ్చింది మన ప్రభుత్వం.. మన ప్రణాళిక సంఘం..
గణితం తెలియదా వారికి.. గుణకాలు..గణాంకాలు  తెలియవా వారికి.. ?
ఇక నేను
 ఎంచక్కా ఇంట్లో కూర్చుని సాగించవచ్చు జీవనం..
అపుడో..ఇపుడో..ఎపుడో..అకడో..ఇకడో..ఎకడో..
అడుక్కుంటే సరి ఒక్క రూపాయి అయినా ఇవ్వకపోతారా ?
౩౭ రూపాయలకి మించి  రాకపోతాయా?
పని అక్కార్లా.. పాట చాలు.. ఆట చాలు..
సమర్పణ: డా. విరించి .. కలం పేరు : ప్రగుణ



No comments:

Post a Comment