Tuesday, 4 October 2011

ఈ దసరా సరదాగా.....

206, Road # 5 , New Nagole Colony ,New Nagole , Hydrabad-35

Land Line: 040-40150174…Mobile: 09348120462
Dr. M.A.Virinchi
               B.A.M.S.,B.A., DHMM, MBA (NU)
Founder Chairman-Hithaoishi-The Well-wisher- Trust, entrusted for 7 dimensional wellness
Chief Monitoring Officer-ISERVE (Institute of Scientific Research on Vedas)
Honorary Consultant: Saroni Health Care Center
Honorary Adviser : Ayurhitha Health Care Center
Honorary Adviser : Dr. Virinchi's Kalpa Ayush Enterprises

Honorary Adviser: PŘefer-Nodal referral centre for better health care
Consultant : Formulation Research & Development , Organisation development  and Learning & Development
          
         ఈ  దసరా సరదాగా.....
సమర్పణ: డా. విరించి .. కలం పేరు : ప్రగుణ

దసరా సరదా    విజయానికి ఆసరా ..
ఒక విజయం మరో విజయానికి ఆశరా.. 

ఒక విజయం మరో విజయానికి రహదారి 
ఒక అపజయం మరెన్నో విజయాలకి సోపానం...
విజయాన్ని సంబరంగా పంచుకున్నా ..పొంగిపోకు సహచరా !
అపజయాలు ఎదురవుతే కుంగిపోకు సుకుమారా !
అవకాశంగా మలచుకుని  ముందుకు కదలు సోదరా  !
సంబరం అంబరాన్ని అంటినా
నేలపైనే నిలబడు మనసా..వాచా ..కర్మణా ..
ఈ విజయం గతం..
ఈనాడు ఈనాటి జీవితం
గతం ఫలితం..

రేపటి కోసం నీ స్వగతం వర్తమానం
లక్ష్య సాధనా దిశగా ప్రయాణం ..

విజయదశమి సాక్షిగా ..
విజయమే  స్ఫూర్తిగా ..
ఎదిగిన జీవితమే ఊపిరిగా ..
ఒదిగి ఉండే తత్వమే అండగా..
సదా విజయాలు సాధించాలని
మీ ప్రగుణ విరించి  ఆకాంక్ష ..

Monday, 3 October 2011

సామాన్యుడి ఆవేదన

206, Road # 5 , New Nagole Colony ,New Nagole , Hydrabad-35

Land Line: 040-40150174…Mobile: 09348120462
Dr. M.A.Virinchi
               B.A.M.S.,B.A., DHMM, MBA (NU)
Founder Chairman-Hithaoishi-The Well-wisher- Trust, entrusted for 7 dimensional wellness
Chief Monitoring Officer-ISERVE (Institute of Scientific Research on Vedas)
Honorary Consultant: Saroni Health Care Center
Honorary Adviser : Ayurhitha Health Care Center
Honorary Adviser : Dr. Virinchi's Kalpa Ayush Enterprises
Honorary Adviser:  PŘefer-Nodal referral centre for better health care  
Consultant : Formulation Research & Development , Organisation development  and
          Learning & Development

సమర్పణ: డా. విరించి .. కలం పేరు : ప్రగుణ
సామాన్యుడి ఆవేదన 
సకలం వికలం అవుతున్నా
కలలోనైనా కలత చెందగలరా ఈ పాలకులు... 
మనిషి మనిషికి మధ్య మానవత నశించి,
రోజు రోజుకీ మనలేని పరిస్థితి పుట్టుకొస్తున్నది... 
విడిపోతామేమో తెలియదు గాని
మనం దినం దినం పడిపోతున్నాం... 
మనలో మానవత రావాలని అనుకొంటే 
ఉన్న మానవత పోయి పాశవికత చెలరేగిపోతోంది.. 
దిన దిన గండం దీర్గాయుశ్యు... 
క్షణం క్షణం బ్రతుకు తెరువుకై పోరాటం... 
ప్రతి క్షణం తదుపరి క్షణంకై ఆరాటం... 
పై చేయి కోసం ఉన్న చేతిని నరుక్కునే ఈ విధానం మనకెందుకు...
ఒక్క సారి... ఒకే ఒక్క సారి... నా ఓటును గుర్తు తెచ్చుకోండి...
మీ అందరికీ నా ఓటు ఊపిరి.. .
అదే మీ జీవితం... 
అందరితో కలిసి ఏకమై ఓటు వేసిన నన్ను బ్రతుకనీయండి....
నా ఓటు మీకు చేటు కాకుండా జాగ్రత్త వహించండి...
మీ కోసం నన్నెందుకు బాధకు గురి చేస్తారు ? 
నా కోసం జీవిస్తే ..నా ఓటు మీకే... 
ముగించండి ఇక ఈ చేవ లేని, బతకనివ్వని, చావనివ్వని విధానాలని... 
నా ఓటు మీకిచ్చాక నాకు మిగిల్చింది ఇదేనా...
కొనసాగనివ్వండి  నా జీవితాన్ని....

Sunday, 2 October 2011

సామాన్యుడి వేదన.. ఆవేదన .. నివేదన ..

Dr. M.A.Virinchi
               B.A.M.S.,B.A., DHMM, MBA (NU)
Founder Chairman-Hithaoishi-The Well-wisher- Trust, entrusted for 7 dimensional wellness
Chief Monitoring Officer-ISERVE (Institute of Scientific Research on Vedas)
Honorary Consultant: Saroni Health Care Center
Honorary Adviser : Ayurhitha Health Care Center
Honorary Adviser : Dr. Virinchi's Kalpa Ayush Enterprises
Honorary Adviser:  PŘefer-Nodal referral centre for better health care  
Consultant : Formulation Research & Development , Organisation development  and
          Learning & Development

సామాన్యుడి వేదన..  ఆవేదన .. నివేదన ..

ఓ పాలకులారా ! ఒక్కసారి విశ్లేషించండి.. వివేచించండి..
ఈ వరాన్ని  నా పాలిట శాపంగా మార్చకండి..
 ఎందుకంటే
౩౭ రూపాయలు సంపాదించగలిగితే లేదు నాకు పేదరికం..
ఎంత మోదం.. మరెంత ప్రమోదం..
ఆ మేరకు ఖర్చు తగ్గితే ఎంత బాగుండు.. ఇక నాదే పెద్దరికం..
ఎలాగోలా ఎవరి గోలా లేకుండా ..నే సంపాదించుకుంటా..
నా ఖర్చు తగ్గించండి..
నేను అమాయకుణ్ణి .. నా ఖర్చు తగ్గించాకే
నా పేదరికాన్ని ధనవంతుడిగా మార్చారనుకుంటున్నా..
ఇక నన్నేమార్చకండి..
నాకు నమ్మకం ..
ఎందుకంటే .. ఈ వరం ఇచ్చింది మన ప్రభుత్వం.. మన ప్రణాళిక సంఘం..
గణితం తెలియదా వారికి.. గుణకాలు..గణాంకాలు  తెలియవా వారికి.. ?
ఇక నేను
 ఎంచక్కా ఇంట్లో కూర్చుని సాగించవచ్చు జీవనం..
అపుడో..ఇపుడో..ఎపుడో..అకడో..ఇకడో..ఎకడో..
అడుక్కుంటే సరి ఒక్క రూపాయి అయినా ఇవ్వకపోతారా ?
౩౭ రూపాయలకి మించి  రాకపోతాయా?
పని అక్కార్లా.. పాట చాలు.. ఆట చాలు..
సమర్పణ: డా. విరించి .. కలం పేరు : ప్రగుణ